ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద చోటుచేసుకుంది. ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు.. నిందితులు పరార్ - masab tank road accident
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
మాసబ్‌ట్యాంక్ వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోయిందని, నిందితులను తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనం నడిపిన వ్యక్తి శిరస్త్రాణం ధరించారని, కారు ఢీకొట్టడం వల్ల అది ఎగిరి కింద పడటం వల్ల గాయపడ్డారని వెల్లడించారు. గాయపడిన వ్యక్తి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో పని చేసే సత్యనారాయణగా గుర్తించారు.
ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ