రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని రేపటి నుంచి మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.
TS weather Report: బలపడిన అల్పపీడనం.. తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వచ్చే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు
తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి రేపటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వివరించారు. ఆ తరువాత పశ్చిమ - వాయువ్య దిశగా కదిలి రేపు సాయంత్రానికి ఉత్తర తమిళనాడు పరిసర దక్షిణ ఆంధ్రా తీరంలోని కరైకల్ -శ్రీహరి కోట మధ్యన కడలూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు.
ఇదీ చూడండి: