పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు బియ్యాన్ని నిల్వ ఉంచిన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 13.6 క్వింటాళ్ల బియ్యం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు - హైదరాబాద్ ఫలక్‌నుమా తాజా వార్తలు
హైదరాబాద్ ఫలక్ నుమా పరిధిలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13.6 క్వింటాళ్ల బియ్యం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
ఫలక్ నుమా పరిధిలోని వట్టె పల్లి ప్రాంతానికి చెందిన సల్మాన్, జహంగీర్‌లు ఇద్దరు కలిసి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తీసుకొని ఇతర రాష్ట్రాలకు తరలించడానికి నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.