కోర్టులో ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం తమపై అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీవీ9 నూతన యాజమాన్యం తెలిపింది. ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయిన రవిప్రకాశ్.. తమపై విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో విచారణను పక్కదారి పట్టించడం కోసం మాత్రమే రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేశారంటూ విమర్శించింది. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా సమాచారం ఇచ్చామని, ఈ వ్యవహారం అంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
'రవి ప్రకాశ్‌పై చట్టపరంగా చర్యలు' - ex ceo
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని టీవీ9 నూతన యాజమాన్యం తెలిపింది. ఫోర్జరీకి పాల్పడి.. క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయిన రవిప్రకాశ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
రవి ప్రకాశ్
ఇవీ చూడండి: 'వాయు': సహాయక చర్యలకు షా ఆదేశాలు