టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పోలీసులు సుధీర్ఘంగా విచారించారు. మూడో రోజు ఉదయం పదిన్నర గంటలకు హాజరైన ఆయన్ను పోలీసులు పలు అంశాలపై ప్రశ్నించారు. రవి ప్రకాష్ సరైన విధంగా సమాధానాలు చెప్పడంలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు టీవీ9 లోగోల విక్రయం కేసులో బంజారాహిల్స్ పోలీసులు రవి ప్రకాష్‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. రేపు బంజారాహిల్స్ ఠాణాలో హాజరుకావాలని ఆదేశించారు.
మూడోరోజు కొనసాగిన విచారణ - tv9
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను సంస్థ బదలాయింపు సంతకాల పోర్జరీ వ్యవహారంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. రేపు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో హాజరుకావాల్సిందిగా అధికారులు నోటిసులో పేర్కొన్నారు.
టీవీ9 సీఈవో చుట్టు బిగుస్తున్న ఉచ్చు