తెలంగాణలో ప్రజా ఉద్యమాల ద్వారానే తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం సహా గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణం వంటి అంశాలతో పాటు తెరాస పాలన, ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవినీతి తదితర అంశాలపై చర్చించారు. కేసీఆర్ హామీలు ఆకాశాన్ని తాకుతుంటే.. పాలన మాత్రం పాతాళంలో ఉందని నర్సిరెడ్డి విమర్శించారు. దేవాలయాలపై రాజకీయ నాయకుల బొమ్మలను చెక్కడాన్ని తెతెదేపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
'తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తాం' - RAMANA
దేవాలయాలపై రాజకీయ నాయకుల బొమ్మలను చెక్కడాన్ని తెదేపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.
TTDP
ఇవీ చూడండి:యాదాద్రిలో ఉద్రిక్తంగా మారిన భాజపా ఆందోళన