తిరుమల శ్రీనివాసుడి లడ్డూ విక్రయాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి హిమాయత్ నగర్‌లోని తితిదే సమాచార కేంద్రం తిరుపతి లడ్డూలు విక్రయిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.... ఉదయం 7 గంటల నుంచే భక్తులు భారీగా కార్యాలయానికి చేరుకున్నారు.
'రెండు గంటల్లోనే 25వేలకు పైగా లడ్డూల అమ్మకం' - తితిదే లడ్డూ
హైదరాబాద్ తితిదే సమాచార కేంద్రంలో శ్రీవారి లడ్డూల విక్రయం ప్రారంభమైంది. భక్తులు లడ్డూల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. విక్రయాలు ప్రారంభించిన 2 గంటల్లోనే 25 వేలకు పైగా లడ్డూలు అమ్ముడయ్యాయి.
'రెండు గంటల్లోనే 25వేలకు పైగా లడ్డూలు అమ్మకం'
విక్రయాలు ప్రారంభించిన రెండు గంటల్లోనే దాదాపు 25 వేలకు పైగా లడ్డూలు అమ్మినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మాస్కులు ధరించి... దూరం పాటిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:'నా 40 ఏళ్ల కెరీర్‌లో అదొక్కటే లోటు'
Last Updated : May 31, 2020, 2:48 PM IST