తెలంగాణ

telangana

ఇక నుంచి బస్టాండ్​లలో యూపీఐ, క్యూఆర్​ కోడ్​లతో నగదు చెల్లింపు అమలు

By

Published : Oct 20, 2021, 5:51 AM IST

తెలంగాణ ప్రగతి రథ చక్రాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పరుగులు పెట్టిస్తున్నారు. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. అన్నింటినీ పక్కాగా తీసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు పలు సౌకర్యాలు కల్పిస్తూ.. మరింత జనాల్లోకి ఆర్టీసీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Tsrtc Upi and Qr Code services Started At telangana Busstands
Tsrtc Upi and Qr Code services Started At telangana Busstands

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త చెప్పారు. నగదు చెల్లింపులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం నేటి నుంచి కొన్ని బస్టాండ్​లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపు సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు.

ప్రయాణికులు యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు పైలట్ ప్రాజెక్ట్​ను ప్రారంభించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్(ఎంజీబీఎస్)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్​లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలను ప్రయాణికులు వినియోగించుకునే వెసులుబాటు కలిగించామన్నారు.

ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని.. తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్(tsrtcmdoffice) ద్వారా తెలియజేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తిచేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details