పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసిన ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగానూ(VC Sajjanar) తన ప్రత్యేకతను చాటుకొంటున్నారు. టీఎస్ఆర్టీసీని(tsrtc) ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు అనేక వినూత్న ప్రయోగాలతో తన మార్క్‌ను చూపిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ప్రయాణికుల్ని ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఇవాళ తన కుటుంబసభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో సందడి చేశారు.
Sajjanar: కుటుంబసమేతంగా సజ్జనార్ సందడే సందడి.. వీడియో వైరల్! - వీసీ సజ్జనార్
MD Sajjanar family: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తన కుటుంబ సభ్యులందరితో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. సంతోషంగా పాటలు పాడుకుంటూ పులకించిపోతున్న వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. సంస్థ అభివృద్ధికి దోహదపడండి అని ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి చేస్తున్నారు.
పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన సజ్జనార్.. తోటి ప్రయాణికుల సమస్యల్ని తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే.. తాజాగా సజ్జనార్ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో(Sajjanar family in tsrtc bus) సందడి చేశారు. టీఎస్ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వివరించేలా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సాయితేజ అనే సామాజిక కార్యకర్త ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. దాన్ని సజ్జనార్ రీట్వీట్(sajjanar tweet) చేశారు.
ఇదీ చూడండి: