TSRTC Free Ride for Women Guidelines : సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా తొలుత రెండింటిని అమలు చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు వెల్లడించటంతో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. తమిళనాడులో కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఆ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో బస్సుల్ని అందుబాటులోకి తెచ్చారు.
హామీల అమలుపై కొత్త సర్కార్ ఫోకస్ - రేపటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
Mahalakshmi Scheme Guidelines Today : కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకోసం మహిళలంతా స్మార్ట్‌కార్డ్‌ల కోసం అప్లై చేసుకోవాలని సూచించింది. అవి వచ్చే వరకు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డుతో ప్రయాణానికి అనుమతిచ్చింది. అయితే కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే రాష్ట్రంలో మహిళా జనాభా తక్కువగా ఉందన్న అధికారులు, ఆ పథకం అమలుతో ఆర్థికంగా కొంత తక్కువ భారమే పడుంతుందని భావిస్తున్నారు. ఆ పథకం అమలు తీరును ఆర్టీసీ అధికారులు కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేస్తున్నారు.
Free RTC Bus Ride in Telangana : మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయాలంటే ఎంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారనేది లెక్క తేలాల్సి ఉంటుంది. అందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. జీరో టికెట్ విధానంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారో లెక్కించే వెసులుబాటు ఉంటుంది. కర్ణాటక తరహా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే రూ.700 కోట్లు వ్యయం కానున్నట్లు భావిస్తున్నారు.
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు - సోషల్ మీడియాలో అసత్య ప్రచారం