TSPSC Group 1 Prelims Results 2023: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిష్పై టీఎస్పీఎస్సీ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు సమయం కోరింది. అయితే అప్పటి వరకు గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వబోమని కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి వాయిదాను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
TSPSC Group 1 prelims Primary Key : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కారణంగా 2022 అక్టోబర్ 16న జరగాల్సిన గ్రూప్-1 పరీక్ష.. ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ఈ సంవత్సరం జూన్ 11న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను పక్బంధీగా నిర్వహించారు. అనంతరం జూన్ 28న గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే తెలపాలని టీఎస్పీఎస్సీ సూచనలు ఇచ్చింది. 2,33,056 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఓఎంఆర్ షీట్లులను ఈ నెల 27 వరకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 పరీక్షను గతంలో రాసిన దానికంటే 50 వేల మంది తక్కువ రాసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు అనంతరం మూడు నెలలు వ్యవధిలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారని టీఎస్పీఎస్సీ గతంలో తెలిపింది.