తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC JOBS : గ్రూప్​-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు - Interviews for Group 1 & 2

TSPSC JOBS : రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న గ్రూప్​-1, గ్రూప్-2 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన కేటగిరీలకు మౌఖిక పరీక్షలు  ఉండవని.. కేవలం రాతపరీక్షల ద్వారానే ఎంపిక  చేస్తారని తెలిపింది. రాతపరీక్షల తర్వాత మౌఖిక పరీక్షలు నిర్వహించి, రెండింటా అత్యధిక మార్కులు సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

Group-1 and Group-2 jobs in telangana
గ్రూప్​-1, గ్రూప్-2 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు

By

Published : Mar 20, 2022, 8:51 AM IST

TSPSC JOBS : రాష్ట్రప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 80,039 ఉద్యోగాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ద్వారా నిర్వహించే గ్రూపు-1, గ్రూపు-2 పోస్టులకు మాత్రమే మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)లు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాతపరీక్షల తర్వాత మౌఖిక పరీక్షలు నిర్వహించి, రెండింటా అత్యధిక మార్కులు సాధించిన వారిని ఎంపిక చేస్తారు. మిగిలిన కేటగిరీలకు మౌఖిక పరీక్షలు ఉండవని, కేవలం రాతపరీక్షల ద్వారానే ఎంపిక చేస్తారని తేలింది.

Interview for Group 1 & 2 : ప్రభుత్వం తాజాగా చేపట్టనున్న ఉద్యోగ నియామకాలు వేర్వేరు నియామక సంస్థల ద్వారా జరుగుతున్నాయి. ఇందులో పోలీసు, విద్య, వైద్య ఆరోగ్యం తదితర శాఖల్లోని ఉద్యోగాల భర్తీ ఆయా నియామక సంస్థల ద్వారా జరుగుతుండగా... మిగిలిన వాటికి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఉద్యోగాలకు అర్హతలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వస్థాయిలో ఇటీవల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మౌఖిక పరీక్షలను గ్రూపు-1, గ్రూపు-2లకే జరపాలని నిర్ణయించారు. రాతపరీక్షల అనంతరం వీటిని నిపుణులతో నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పోస్టుల్లో గ్రూపు-1 ఉద్యోగాలు 503, గ్రూపు-2 ఉద్యోగాలు 582 ఉన్నాయి.

గ్రూపు-1, 2లలో పోస్టులు

గ్రూపు-1లో ఉప కలెక్టర్‌, ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీవో), డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ), జిల్లా రిజిస్ట్రార్లు, వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో), జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఉపాధి అధికారి, పరిపాలనాధికారి (ఏవో), డివిజనల్‌ అగ్నిమాపక అధికారి, సహకార డిప్యూటీ రిజిస్ట్రార్‌, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2, కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి, సహాయ ట్రెజరీ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తదితర పోస్టులుంటాయి.

గ్రూపు-2లో పురపాలక కమిషనర్‌ గ్రేడ్‌-3, ఏసీటీవో, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, పంచాయతీరాజ్‌ విస్తరణాధికారి, ఎక్సైజ్‌ ఎస్‌ఐ, ఉపతహసీల్దార్‌, సహాయ రిజిస్ట్రార్‌, దేవాలయ కార్యనిర్వహణాధికారి గ్రేడ్‌-1, సహాయ కార్మిక అధికారి, సచివాలయ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, చేనేత, జౌళిలో సహాయ అభివృద్ధి అధికారి తదితర పోస్టులుంటాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details