TS Genco: ఏపీ విద్యుత్ బకాయిలపై టీఎస్ జెన్‌కో హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ జెన్ కో నుంచి రూ.4774 కోట్లు రావల్సి ఉందని హైకోర్టుకు తెలిపింది. బకాయిలు చెల్లించేలా ఏపీ జెన్‌కోను ఆదేశించాలని టీఎస్ జెన్‌కో కోరింది. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.
TS Genco: బకాయిలపై హైకోర్టుకు టీఎస్ జెన్‌కో.. ఏపీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు - టీఎస్ జెన్‌కో
20:29 June 13
TS Genco: బకాయిలు చెల్లించేలా ఏపీ జెన్‌కోను ఆదేశించాలన్న టీఎస్ జెన్‌కో
టీఎస్ జెన్‌కో పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే తెలంగాణ నుంచి బకాయిలు ఇప్పించాలని గతంలో హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్ వేసింది. కానీ ఇటీవల ఏపీ జెన్‌కో పిటిషన్ ఉపసంహరించుకుంది. విభజన సమస్యల కమిటీ వద్ద పరిష్కరించుకుంటామని ఏపీ జెన్‌కో తెలిపింది. ఏపీ పిటిషన్లు వేస్తూ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోందన్న టీఎస్ జెన్‌కో ఆరోపిస్తోంది.
ఇవీ చదవండి: