తెలంగాణ

telangana

ETV Bharat / state

Intintiki BJP Program : జూన్​ 22న 'ఇంటింటికీ బీజేపీ' కార్యక్రమం

Massive Intintiki BJP Program : 'ఇంటింటికీ బీజేపీ' పేరుతో కాషాయదళం గురువారం రోజున ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలింగ్ బూత్ అధ్యక్షుడు మొదలు... రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరూ కనీసం వంద మంది కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు కరపత్రాలను పంపిణీ చేయనున్నారు.

BJP
BJP

By

Published : Jun 21, 2023, 8:13 AM IST

రాష్ట్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం

Intintiki BJP Program : నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 22న ఇంటింటికీ బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరకు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు.

గురువారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు ఇంటింటికీ బీజేపీ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు. రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలున్నాయి. ప్రతి పోలింగ్ కమిటీ అధ్యక్షుడు తమ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఈ నెల 22న వంద కుటుంబాలను కలిసి నరేంద్రమోదీ పాలనలో జరిగిన అభివ్రుద్ధిని వివరించడంతోపాటు ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటించనున్నారు. సంజయ్‌ స్వయంగా ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలు, ప్రజలకు జరిగిన మేలును వివరించడమే కాకుండా కరపత్రాలను సైతం అందజేయనున్నారు. కేంద్రం తెలంగాణకు చేసిన సహాయంతో పాటు కేసీఆర్‌ అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టనున్నారు.

Kishanreddy Partcipating In Intintiki BJP : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సహా రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలంతా రేపు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పర్యటించి ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలిసేలా ప్లాన్‌ చేశారు. మహా జనసంపర్క్ యాత్రలో భాగంగా ఈ నెల 22 నుంచి 30 వరకు ఇంటింటికీ బీజేపీ పేరుతో నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని కలిసి నరేంద్రమోదీ పాలనను వివరించడంతో పాటు ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

22June Intintiki BJP : కన్నడనాట ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ బీజేపీపై పడింది. ఉత్తేజంలో ఉన్న కాషాయశ్రేణులు కాస్త నిస్తేజంలోకి వెళ్లిపోయాయి. గత నెలరోజులుగా పార్టీ కార్యక్రమాలు పెద్ధగా నిర్వహించకపోవడంతో పార్టీ ముఖ్యనేతల వ్యాఖ్యలు శ్రేణులను ఆందోళనకు గురిచేశాయి. పార్టీలో ఉత్తేజాన్ని నింపే లక్ష్యంగా ఈ నెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినప్పటికీ తుఫాన్‌ కారణంగా అమిత్‌ షా పర్యటన రద్దుకావడంతో రాష్ట్ర నాయకత్వం సభను సైతం వాయిదా వేసింది. దీంతో శ్రేణుల్లో మరింత నిరూత్సాహాం నెలకొంది ఇంటింటింకి బీజేపీ పేరుతో ఒకే రోజు 35లక్షల కుటుంబాలను కలిసి పోలీంగ్‌ బూత్‌ స్థాయిలో బీజేపీ సత్తాను చాటాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తే పార్టీకి మరింత ఊపురావడంతో పాటు ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తారనే అంచనా వేస్తోంది.

మరోవైపు ఈ నెల 25న జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సైతం నాగర్​కర్నూల్‌లోనిర్వహించే సభకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. నడ్డా పర్యటన పార్టీలో నూతనుత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నడ్డా తెలంగాణ పర్యటనను రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. బండిసంజయ్‌ స్వయంగా సభ ఏర్పాట్లను పరిశీలించారు. లక్షమందిని తరలించే లక్ష్యంగా కమలదళం ప్లాన్‌ చేస్తోంది. వాయిదా పడిన ఖమ్మం సభను ఈ నెలాఖరుకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

PM Narendra Modi Roadshow In Medchal : మహా జన్​సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి పాల్గొనే మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో రోడ్డు షోతో పాటు ఏదేని ఒక పార్లమెంట్‌ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి మోదీ విదేశీ పర్యటన అనంతరం పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అగ్రనేతల పర్యటనను రాష్ట్రనాయకత్వం ప్లాన్‌ చేస్తోంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details