తెలంగాణ

telangana

ETV Bharat / state

RAKSHA BANDHAN: మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన పలువురు మహిళా నేతలు - trs women leaders celebrated rakhi pournami with minister ktr

రక్షా బంధన్​ వేడుకల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. పలువురు తెరాస మహిళా నేతలు ప్రగతి భవన్​కు చేరుకుని కేటీఆర్​కు రాఖీ కట్టారు.

rakhi
రాఖీ

By

Published : Aug 22, 2021, 3:29 PM IST

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్​కు పలువురు మహిళా నేతలు రాఖీ కట్టారు. వారితో కలిసి ప్రగతి భవన్​లో కేటీఆర్​ రక్షా బంధన్​ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి సత్యవతి రాఠోడ్​, ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్​ రెడ్డి, జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, వరంగల్​ మేయర్​ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ ఛైర్​ పర్సన్​ జ్యోతి, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కేటీఆర్​కు​ రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.

ఆడపడుచులందరికీ కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. సోదరసోదరీమణులకు రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి:RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ABOUT THE AUTHOR

...view details