రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం వెంటనే విడుదల చేయాలని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులోనూ కేంద్రం వివక్షత చూపుతోందంటూ... పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వెనుకబడిన జిల్లాలకు విడుదల చేయాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధితోపాటు మిషన్ భగీరథకు ఇస్తామన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెరాస నిర్ణయించింది.
పార్లమెంట్ ఆవరణలో తెరాస ఎంపీల నిరసన
దిల్లీలోని పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్టానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్షత చూపుతోందని మండిపడ్డారు.
జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: తెరాస ఎంపీలు