అధికారంలో లేని రాష్ట్రాల్లో పాగా వేయడం కోసం భాజపా నాయకులు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. కనీసం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే ప్రతిచిన్న విషయానికి మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. నాలుగు సీట్లు గెలవగానే.. ప్రజలంతా తమ వైపే ఉన్నారనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కమలం పార్టీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని... తెలంగాణలో మత రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. ప్రజలు తెరాస వెంటే ఉంటున్నారని కర్నె ప్రభాకర్ అన్నారు.
'అధికారం కోసం భాజపా చిత్ర విచిత్ర విన్యాసాలు' - karne
నాలుగు సీట్లు గెలవగానే భాజపా నాయకులు ప్రజలంతా... తమ వైపే ఉన్నారనే భ్రమలో ఉన్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. తెలంగాణలో మత రాజకీయాలకు తావే లేదని స్పష్టం చేశారు.
భాజపా చిత్ర విచిత్ర విన్యాసాలు