తెరాస పార్టీకి తాను పదవుల కోసం రాలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పట్ల ఆకర్షితులై వచ్చానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై తాను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. వివిధ సమీకరణాలు, ప్రభుత్వ అవసరాల నేపథ్యంలో మంత్రులు ఎవరని నిర్ణయించే అధికారం పూర్తిగా కేసీఆర్‌కే ఉందని పేర్కొన్నారు. తన భార్య గండ్ర జ్యోతికి జడ్పీ ఛైర్ పర్సన్ పదవి రావడం సీఎం ఆశీస్సుల వల్లేనని తెలిపారు. తాను అనని మాటలను కొన్ని పత్రికలు రాయడం మంచిది కాదని అన్నారు. వార్త విలువలను వదిలేసి అసత్యాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
'మంత్రి వర్గ విస్తరణపై అసంతృప్తి లేదు'
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. తాను అసంతృప్తి చెందినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. తెరాసలోకి తాను పదవుల కోసం రాలేదని... సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఆకర్షితులై మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి