తెలంగాణ

telangana

ETV Bharat / state

మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి గంగుల - మంత్రి గంగుల కమలాకర్ తాజా వార్తలు

గ్రేటర్​ ఎన్నికల కోసం తెరాస విడుదల చేసిన మేనిఫెస్టోపై మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ వై కూడలి వద్ద కార్పొరేటర్ అభ్యర్థితో కలిసి సీఎం చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం నిర్వహించారు.

మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి గంగుల
మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి గంగుల

By

Published : Nov 23, 2020, 5:55 PM IST

పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్... జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను రూపొందించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారని కొనియాడారు.

మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా హిమాయత్ నగర్ వై కూడలి వద్ద కార్పొరేటర్ అభ్యర్థితో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి అనంతరం బాణాసంచా పేల్చారు. తెరాస చేసిన అభివృద్ధే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల... ముఖ్యాంశాలివే

ABOUT THE AUTHOR

...view details