అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ముందే అభ్యర్థుల జాబితా విడదల చేసిన గులాబీ బాస్... లోక్‌సభ ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సర్వేలతో పాటు వివిధ రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకొన్న గులాబీ దళపతి గెలుపు గుర్రాల పేర్లను ప్రకటించారు. పాత కొత్త కలయికలతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఏడుగురు సిట్టింగ్లతో పాటు 10 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మరోసారి పునరావృతం కావాలనే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ స్థానానికి వినోద్ కుమార్ నామపత్రాలు దాఖలు చేశారు.
కేసీఆర్ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితా
సారు... కారు... సర్కారు... పదహారే లక్ష్యంగా తెరాస అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వేలతో పాటు వివిధ రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకొన్న గులాబీ దళపతి....ఏడుగురు సిట్టింగ్లతో పాటు 10 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు.
తెరాస లోక్‌సభ అభ్యర్థుల జాబితా
తెరాస లోక్‌సభ అభ్యర్థుల జాబితా...
లోక్‌సభ స్థానం | అభ్యర్థి |
కరీంనగర్ | బి.వినోద్ కుమార్ |
నిజామాబాద్ | కల్వకుంట్ల కవిత |
ఆదిలాబాద్ | జి.నగేశ్ |
మెదక్ | కొత్త ప్రభాకర్‌రెడ్డి |
జహీరాబాద్ | బీబీ పాటిల్ |
వరంగల్ | పసునూరి దయాకర్ |
భువనగిరి | బూర నర్సయ్య గౌడ్ |
ఖమ్మం | నామ నాగేశ్వరరావు |
నాగర్‌కర్నూల్ | పి.రాములు |
చేవెళ్ల | గడ్డం రంజిత్ రెడ్డి |
సికింద్రాబాద్ | తలసాని సాయికిరణ్ |
మల్కాజిగిరి | మర్రి రాజశేఖర్ రెడ్డి |
మహబూబ్‌నగర్ | మన్నె శ్రీనివాస్ రెడ్డి |
పెద్దపల్లి | బోర్లకుంట వెంకటేశ్ నేతకాని |
నల్గొండ | వేమిరెడ్డి నరసింహారెడ్డి |
మహబూబాబాద్ | మాలోత్ కవిత |
హైదరాబాద్ | పుస్తె శ్రీకాంత్ |
Last Updated : Mar 22, 2019, 7:17 AM IST