తెలంగాణ

telangana

ETV Bharat / state

trs dharna : కేంద్రంపై ముప్పేట దాడికి సిద్ధమైన గులాబీ దళం - తెలంగాణలో నిరసనలు

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ... నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి ధర్నాలు చేపట్టనుంది (trs dharna across the state). పార్టీ శ్రేణులతో పాటు భారీగా రైతులను సమీకరించాలని.... కేసీఆర్ (cm kcr), కేటీఆర్ (minister ktr)పిలుపునిచ్చారు. కేంద్రంపై ముప్పేట దాడికి సిద్ధమైన తెరాస... పలు అంశాలపై వివిధ రూపాల్లో ఆందోళనలకు వ్యూహ రచన చేస్తోంది.

trs dharna
trs dharna

By

Published : Nov 12, 2021, 5:16 AM IST

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు... గులాబీ (trs party) సైన్యం సిద్ధమైంది (trs dharna across the state). ఉదయం పది నుంచి మధ్యాహ్నం వరకు ధర్నాలు చేసేందుకు తెరాస ఏర్పాట్లు చేసింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీ రామారావు ( minister ktr) .. గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య తీవ్రతను చాటేలా ధర్నాలు నిర్వహించాలని సూచించారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLA Quota MLC Election Code) అమల్లో ఉన్నందున... కేటీఆర్‌ సూచన మేరకు అన్ని జిల్లా కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు.

ఎవరు ఎక్కడంటే..

హైదరాబాద్‌లో నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు... ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌లో (Indira Park Dharna Chowk) ఆందోళనకు చేయనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రైతులను కూడా భారీగా సమీకరించాలని కేసీఆర్ (cm kcr) , కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో... హరీశ్​రావు (minister harish rao) సిద్దిపేటలో.. మంత్రులు, సీనియర్ నేతలు వారి నియోజకవర్గాల్లోనే ధర్నాల్లో పాల్గొనున్నారు.

వడ్డు ఎందుకు కొనరో నిలదీయాలి

తెరాస చేపడుతున్న నిరసన కార్యక్రమంలో రైతులంతా పెద్దసంఖ్యలో పాల్గొని... వడ్లు ఎందుకు కొనరో....భాజపాను నిలదీయాలని.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (minister errabelli dayakar rao ) పిలుపునిచ్చారు. కేంద్రం ధాన్యం కొనేవరకూ తమ పోరాటం ఆగదని... హన్మకొండలో చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలను ప్రోత్సహించేందుకే... కేంద్రం ధాన్యం కోనుగోలు చేయట్లేదని ఆయన ఆరోపించారు.

ఇదీ చూడండి:Palla Rajeshwar Reddy: 'భాజపా నేతలు రాష్ట్రంలో కాదు... దిల్లీలో ధర్నా చేయండి'

దిల్లీలోను ధర్నా చేసేందుకు..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస చాలా అరుదుగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఖమ్మం జిల్లాలో (Khammam district) ఏడు మండలాలను కలిపినప్పుడు తెరాస ఆందోళనలు చేపట్టింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహబూబ్​నగర్ జిల్లా బూర్గుల వద్ద తెరాస నిర్వహించిన ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్రంపై ముప్పేట దాడికి సిద్ధమైన తెరాస... పలు అంశాలపై వివిధ రూపాల్లో ఆందోళనలకు వ్యూహ రచన చేస్తోంది. దిల్లీలోనూ ధర్నా (trs dharna in Delhi) చేయాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో పోరాటాలకు ప్రణాళికలు చేస్తున్న తెరాస.. దేశవ్యాప్తంగా పలు పార్టీలను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఎత్తుగడలను సిద్ధం చేస్తోంది.

ఇదీ చూడండి:Minister Errabelli: భాజపా నేతలను రైతులు ఉరికించి కొడతారు

ABOUT THE AUTHOR

...view details