బలమైన ఈదురు గాలుల వల్ల హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలల్లో చెట్లు నేలకొరిగాయి. నిన్న కురిసిన వర్షం, ఈదురు గాలులతో నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం కూలిపోయింది. చెట్టుకూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో చెట్టును తొలగించే ఏర్పాట్లను విశ్వవిద్యాలయం సిబ్బంది చేస్తున్నారు. భారీ చెట్టు వేళ్లు కుళ్లిపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.
భాగ్యనగరంలో ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు
హైదరాబాద్లో బలమైన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం నేలకూలింది. కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
భాగ్యనగరంలో ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు