తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యం : పువ్వాడ - రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తెలిపారు. ఈరోజు హైదరాబాద్​లోని ర​వాణా శాఖ భవన్​లో ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్​ శర్మ, ఈడీలతో సమీక్షించారు. ఉద్యోగ భ‌ద్ర‌త‌, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

Transport Minister Puvvada Ajay
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

By

Published : Feb 12, 2020, 11:24 PM IST

Updated : Feb 12, 2020, 11:47 PM IST

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

హైదరాబాద్​లోని రవాణా శాఖ భవన్​లో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ, ఈడీలతో సమావేశమయ్యారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లపైు అధికారుల‌తో చర్చించారు. సీఎం కేసీఆర్ సూచించిన విధంగా ఆర్టీసీ బ‌లోపేతంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.

వారం రోజుల్లోగా విధివిధానాల‌ు

ఆర్టీసీ ఉద్యోగుల భ‌ద్ర‌తకు సంబంధించిన విధివిధానాల‌ను వారం రోజుల్లోగా త‌యారు చేసి అందించాలని ఈడీలను మంత్రి ఆదేశించారు. వోటీ, మెడిక‌ల్ గ్రౌండ్, సెల‌వుల కోసం వ‌చ్చే విన‌తుల‌పై మాన‌వ‌తా దృక్పథంతో వ్య‌వ‌హ‌రించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించి వాటి ప‌రిష్కరించాలని సూచించారు.

ప్ర‌యాణికుల‌తో స్నేహ‌ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం

బ‌స్సుల్లో బాధ్య‌త‌గా టికెట్ తీసుకునేలా ప్ర‌యాణికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం క‌ల్పించడంపై దృష్టి సారించిన‌ట్లు ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శ‌ర్మ‌ మంత్రికి వివ‌రించారు. ప్ర‌యాణికుల‌తో స్నేహ‌ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం, బ‌స్సు ఎక్కే వారికి మ‌ర్యాద పూర్వ‌కంగా ఆహ్వ‌నం ప‌ల‌క‌డం, ప్ర‌త్యేక రోజుల్లో ప్ర‌యాణికులను విధిగా విష్ చేయ‌డం వంటి వాటిపై సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పిస్తామన్నారు.

ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

Last Updated : Feb 12, 2020, 11:47 PM IST

ABOUT THE AUTHOR

...view details