తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ నియంత్రణలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది: పువ్వాడ - హైదరాబాద్​ తాజా వార్తలు

కొవిడ్‌ నియంత్రణలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. తానా ఆధ్వర్యంలో 700 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను హైదరాబాద్‌లో మంత్రి పంపిణి చేశారు.

కొవిడ్‌ నియంత్రణలో తెలంగాణ అదర్శంగా నిలిచింది: పువ్వాడ
కొవిడ్‌ నియంత్రణలో తెలంగాణ అదర్శంగా నిలిచింది: పువ్వాడ

By

Published : Jun 12, 2021, 5:01 PM IST

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌నే అంతిమ పరిష్కారమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్​లో తానా ఆధ్వర్యంలో 700 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను మంత్రి పంపిణి చేశారు. కొవిడ్‌ సంక్షోభంలో గత 18 నెలల్లో తానా అందిస్తున్న సేవలను ప్రశంసించారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ మార్గదర్శకం వల్లే కరోనా నియంత్రణ సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాబోయే రెండేళ్లలో రూ.10 వేల కోట్లతో పేదలకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు ఆయన చెప్పారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కొవిడ్‌ కారణంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి చేయూత ఇచ్చేందుకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతోపాటు పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా తెలంగాణ ట్రస్టీ శ్రీనాథ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:Weather: ఆ జిల్లాల్లో.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

ABOUT THE AUTHOR

...view details