తెలంగాణ

telangana

ETV Bharat / state

రికార్డు స్థాయిలో రవాణాశాఖ ట్యాక్స్​ వసూళ్లు.. ఏకంగా రూ. 6,390 కోట్లు - రికార్డ్​ స్థాయిలో రవాణాశాఖ వసూళ్లు

RTA Vehicletax Increase In Telangana: రవాణాశాఖలో కాసుల వర్షం కురిసింది. రికార్డ్ స్థాయిలో ట్యాక్స్​లు వసూలయ్యాయి. ప్రత్యేక కార్యాచరణతో ఇదంతా సాధ్యమైనట్లు రవాణాశాఖ చెబుతోంది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్​లను నిర్వహించడంతోనే రికార్డు స్థాయిలో పన్నులు వసూలైనట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే..రవాణాశాఖకు 61శాతం అధికంగా ట్యాక్స్​లు వసూలైంది.

RTA Vehicletax Increase
RTA Vehicletax Increase

By

Published : Apr 2, 2023, 6:50 PM IST

RTA Vehicletax Increase In Telangana: డ్రైవర్ల లైసెన్స్​లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల జారీ, పన్ను వసూళ్లు, వాహనాల ఉల్లంఘనల అమలు నుంచి రెవెన్యూ వసూళ్లలో రవాణాశాఖ కీలకపాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 1.53 కోట్ల పైచిలుకు వాహనాలు ఉన్నాయి. సొంత వాహనాలకు లైఫ్ ట్యాక్స్​ను చెల్లిస్తారు. ఇక రవాణా వాహనాలకు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి క్వార్టర్ ట్యాక్స్​ను చెల్లిస్తారు. గత ఐదు క్వార్టర్లు చెల్లించని వాహనదారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు.

మార్చి 30 వరకు ప్రత్యేక డ్రైవ్​: ఇటువంటి వాహనాలపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 31 వరకు రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్​లను నిర్వహించింది. రవాణాశాఖకు ట్యాక్స్​లు చెల్లించకుండా కట్టకుండా తిరుగుతున్న వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనదారులు తమంతట తాము ట్యాక్స్ చెల్లిస్తే.. 50శాతం అపరాధ రుసుముతో వదిలేస్తామని లేకుంటే 200 శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని రవాణాశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే భారీగా ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు భావిస్తున్నారు.

రవాణా శాఖకు రికార్డ్​ స్థాయి ఆదాయం: 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,390.80కోట్ల ఆదాయం వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. 2021-22లో రూ.3,971.38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కన్నా 61శాతం అధికంగా ఆదాయం వచ్చింది. వాణిజ్య వాహనాలు త్రైమాసిక పన్నులు గత ఏడాది రూ.466.38 కోట్లు వసూలు అయితే, ఈ ఏడాది రూ.779 కోట్లు వసూలైంది. వాహనాల ఫీజుల రూపంలో గత ఏడాది రూ.418.91 కోట్లు వస్తే, ఈ ఏడాది రూ.552.53 కోట్లు వచ్చింది. హరిత పన్ను గత ఏడాది రూ.5.54 కోట్లు వస్తే, ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.64.63 కోట్లు వచ్చింది. అపరాధ రుసుము రూపంలో గత ఏడాది రూ.64.95 కోట్లు వస్తే, ఈ ఏడాది రూ. 189.93 కోట్లు వసూలైంది. వివిధ సేవలకు యూజర్ ఛార్జీల రూపంలో గత ఏడాది రూ.119 కోట్లు వస్తే, ఈ ఏడాది రూ.134.58 కోట్లు ఆదాయం వచ్చింది. రవాణాశాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ డ్రైవ్​లు చేయడంతోనే ఇదంతా సాధ్యమైనట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక కేసులు: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో భారీగా ట్యాక్స్ లు చెల్లించుకుండా వాహనాలు తిరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. మ్యాక్సీ క్యాబ్ లు, కాంట్రాక్ట్ క్యారేజ్ వాహనాలు వంటి వాటిపై ఎక్కువగా తనిఖీలు చేస్తున్నట్లు రవాణాశాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా రవాణాశాఖ పరిధిలో ఇప్పటి వరకు 2,344 వాహనాలపై కేసులు నమోదు చేసి, వాటికి రూ.3.90 కోట్ల ట్యాక్స్ ను వసూలు చేసినట్లు రంగారెడ్డి రవాణాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 4,758 వాహనాలపై కేసులు నమోదు చేసి ఇప్పటి వరకు రూ.8 కోట్ల వరకు ట్యాక్స్ ను వసూలు చేసినట్లు హైదరాబాద్ రవాణాశాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details