తెలంగాణ

telangana

ETV Bharat / state

అలా జరిగితే కేసీఆర్​ రాజీనామా చేయాలి: ఉత్తమ్​

ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు కేసీఆర్ ఫండింగ్ చేసినప్పటి నుంచి జగన్, కేసీఆర్ అన్ని కలసే చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ ఆరోపించారు. జగన్, కేసీఆర్ అలాయ్ బలాయ్​గా తిరుగుతున్నారని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉంటే తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అయితే పోతిరెడ్డిపాడు పనులు ప్రారంభమైతే.. కేసీఆర్ రాజీనామా చేయాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నీళ్ల కోసం.. ఇప్పుడు ఆ నీళ్లే ఇతర రాష్ట్రం వారు ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నాలుగు నెలల నుంచి జగన్, వైసీపీ నేతలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతున్నా.. కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు.

అలా జరిగితే కేసీఆర్​ రాజీనామా చేయాలి: ఉత్తమ్​
అలా జరిగితే కేసీఆర్​ రాజీనామా చేయాలి: ఉత్తమ్​

By

Published : May 13, 2020, 2:30 PM IST

Updated : May 13, 2020, 2:37 PM IST

11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల కు పెంచితేనే వ్యతిరేకించాం. ఇప్పుడు 44 వేల క్యూసెక్కుల నుంచి 88వేలకు పెంచితే ఊరుకుంటామా. ఇదే జరిగితే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది. ఎపీ ఇప్పటికే కృష్ణా నుంచి ఎక్కువ నీరు తీసుకుపోతుంది. లక్షల కోట్ల దోపిడీకి కేసీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. రిటైర్డ్ అయిన వ్యక్తికి కీలకమైన ఇరిగేషన్ బాధ్యతలు ఏంటీ ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రెండు టీఏంసీల నుంచి 1 టీఏంసీకి ఎందుకు మరళీధర్ రావు తగ్గించారు. మరళీధర్ రావుపై చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతుల కోసం కాదు.. వీళ్ల జేబులు నింపుకోవడానికి. లాక్ డౌన్ సమయంలో కేసీఆర్ చీకటి ఓప్పందాలు చేసుకుంటున్నారు. రెండు టీఏంసీల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. మరో వైపు జగన్ నాలుగు టీఏంసీల నీరు తీసుకెళ్తున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదు. పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధం. ప్రధానమంత్రిని, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తాం.

-ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

అలా జరిగితే కేసీఆర్​ రాజీనామా చేయాలి: ఉత్తమ్​

ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

Last Updated : May 13, 2020, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details