పార్లమెంట్ సభ్యుల సూచనలను.. ప్రధాని పెడచెవిన పెట్టడం వల్లే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. తన ప్రతిష్టను పెంచుకోడానికి మోదీ.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించారని ఆరోపించారు. గాంధీభవన్‌లో.. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు కొమురయ్యతో కలిసి ఆయన మీడియాతో మట్లాడారు.
‘దేశంలో ఎక్కడికెళ్లినా మృత్యుఘోష వినిపిస్తోంది’ - vaccine disputes
దేశంలో ఎక్కడికెళ్లినా మృత్యుఘోష వినిపిస్తోందంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ.. తన ప్రతిష్టను పెంచుకోడానికి, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించారని ఆయన ఆరోపించారు.
vaccine dispute
దేశంలో ఎక్కడికెళ్లినా మృత్యుఘోష వినిపిస్తోందంటూ మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి.. కరోనా బారిన పడ్డ వారందరికీ సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు