PCC All Party Meeting: 'బచావో హైదరాబాద్' పేరున బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి వివిధ పార్టీల నాయకులను స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై రేపు ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. తెరాస, భాజపా, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను, సామాజిక కార్యకర్తలను, మహిళా సంఘాలను సమావేశానికి రావల్సిందిగా కాంగ్రెస్ ఆహ్వానించింది.
షర్మిల, ఆర్ఎస్పీకి ఫోన్లో రేవంత్ ఆహ్వానం..
PCC All Party Meeting: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనిపై అఖిలపక్ష భేటీ జరపాలని నిర్ణయించింది. బుధవారం నిర్వహించే ఈ సమావేశానికి తెరాస, భాజపా, ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు ఆహ్వానం అందింది.
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అఖిలపక్ష సమావేశానికి రావాలని కోరారు. తాను తప్పకుండా హాజరవుతానని షర్మిల చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అదే విధంగా బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కూడా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రావాల్సిందిగా కోరారు. అయితే తాను అందుబాటులో లేనని చెప్పిన ప్రవీణ్‌కుమార్ తమ పార్టీ తరఫున ఒకరిని పంపుతానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :