పంచాయతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ నాయకులతో కలిసి గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థపై సమావేశం నిర్వహించారు.
'పంచాయతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేస్తోంది' - tpcc chief uttam kumar reddy allegations
సర్పంచ్‌లకు రావాల్సిన బిల్లులను చెల్లించకుండా తెరాస ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ... పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై త్వరలోనే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలోని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల అధికారాలను... తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. సర్పంచ్‌లకు రావాల్సిన బిల్లులు చెల్లించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోందని... మండల, జిల్లా పరిషత్‌లు అధ్వానంగా మారాయన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తెరాసలో చేరకపోతే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో ప్రణాళికబద్ధంగా ఉద్యమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల సమస్యలపై ఈ నెల 22న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి:'అమ్మలాంటి రంగానికి కీడు తలపెడతామా?