హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election)ను దేశంలోనే ఖరీదైందిగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Tpcc Chief Revanth Reddy) అన్నారు. పంపకాల్లో తేడాతోనే హరీశ్, ఈటల మధ్య మాటలయుద్ధం జరుగుతోందన్నారు. నిరుద్యోగ యువతి నిరోషాపై తెరాస నేతలు దాడులు చేశారని రేవంత్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి గురించి ప్రశ్నించినందుకే నిరోషాపై దాడి చేశారని మండిపడ్డారు. పీఎస్‌కు వెళ్లినా నిరోషాకు న్యాయం జరగలేదన్న రేవంత్... ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడిని కాంగ్రెస్ ఖండిస్తుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బల్మూరి వెంకట్(Balmuri Venkat)పైనా దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి గురైనందుకే వెంకట్‌ను హుజూరాబాద్ బరిలో దింపినట్లు రేవంత్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్ ఎన్నికకు హరీశ్‌రావు కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు(Harish Rao)పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పకొచ్చారు. వ్యూహం ప్రకారమే తెరాస, భాజపా దళితబంధును ఆపాయన్నారు. బీసీల మీదకు ఎస్సీలను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. చెల్లినే గెలిపించుకోలేని కేటీఆర్ తన గురించి మాట్లాడటమేంటన్నారు. నవంబర్ 15 లోపు కేటీఆర్.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.