హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలను అధికారులు ఎట్టకేలకు పాదచారుల ప్రాంతంగా తీర్చిదిద్దారు. సందర్శకుల కోసం అక్కడి యునాని ఆసుపత్రికి ఆనుకుని మరుగుదొడ్లు నిర్మించారు. కానీ, అటువైపు వెళ్లడానికి వీలు లేకుండా చిరువ్యాపారులు తోపుడు బండ్లు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక చార్మినార్ ముందు భాగంలో చిరు వ్యాపారుల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. చార్మినార్ ముందు కూర్చొని చారిత్రక కట్టడాన్ని చూసే విధంగా కుర్చీలు ఏర్పాటు చేయాలి. అలాగే బైనాక్యులర్ ఏర్పాటు చేసి చార్మినార్ అందాలను తనివితీరా చూడవచ్ఛు
దుర్గం చెరువు వద్ద వేలాడే వంతెనను ఏర్పాటు చేశారు. ఇప్పుడది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్‌బండ్ తర్వాత ఇప్పుడు దుర్గం చెరువుపై నిర్మించిన వేలాడే వంతెనను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. గతంలో దుర్గం చెరువులో ఉన్న బార్‌అండ్‌రెస్టారెంటు మూత పడింది. తాజాగా జలాల్లో తేలియాడే బోట్లు అందుబాటులోకి తెచ్చి, అందులోనే రెస్టారెంట్లు ఉండేలా చూస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వంతెన ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అక్కడ ఒక్క పని కూడా జరగలేదు.
నెక్లెస్ రోడ్డు
* హైదరాబాద్ రుచులు పర్యాటక ప్రాంతాల్లో అందేలా రెస్టారెంట్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. నెక్లెస్ రోడ్డులో ఫుడ్ ఫెస్టివల్స్ తరచూ జరిగేలా డ్రేవిన్‌లు రావాలి.
* నగరంలో చాలా చెరువులు ఉన్నప్పటికీ.. ఒక్క హుస్సేన్‌సాగర్‌లో మాత్రమే బోటు షికారు ఉంది. దీంతోపాటు మిగితా చెరువులనూ సుందరీకరించి అక్కడా బోటు షికారు ఏర్పాటు చేస్తే సందర్శకులను మరింత ఆకట్టుకోవచ్ఛు ● గోల్కొండ కోట కేంద్ర ఆర్కియాలజీ విభాగంలో ఉన్నా.. అక్కడ లైట్ అండ్ సౌండ్ షో తప్ప మరే ఆకర్షణలూ లేవు. రాజులు కొలువుదీరిన ప్రాంతాల్లో రాజప్రసాదంలా భోజనశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడ హోటళ్లు లేక కోటకు ఎదురుగా ఉన్న చిన్నా చితక హోటళ్లలో తిని పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. కోటలోనే కాస్త సేదదీరేందుకు వెసులుబాటు కల్పించాలి.