తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ టెన్ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@7PM
టాప్​టెన్ న్యూస్@7PM

By

Published : Dec 14, 2020, 6:58 PM IST

1. నియామక ప్రక్రియ వేగవంతం

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. అధికారులు చర్యలు చేపట్టారు. అన్నిశాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. కేంద్రానికి రైతుల హెచ్చరిక

దిల్లీ సరిహద్దుల్లో రహదారులపై కూర్చుని దీక్ష చేపట్టిన రైతులు.. కేంద్రానికి బలమైన సందేశాన్ని పంపారు. సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ

ప్రాజెక్టుల పేరిట ఎన్నిరోజులు ప్రజలను దోచుకుంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్​ అంచనాలను ఇష్టారీతిన మార్చారని.. డీపీఆర్​లు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం మూడుసార్లు లేఖ రాసిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. అయోమయ పాలన

రాష్ట్రంలో ప్రభుత్వపాలన అయోమయంగా ఉందని.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తెరాస సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులపై భట్టి విమర్శలు గుప్పించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. గల్లీలో కుస్తీ.. దీల్లీలో దోస్తీ

కేసులకు భయపడే సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లారని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ విమర్శించారు. తెరాస, భాజపా మధ్య గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీలా ఉందని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. గూగుల్ సర్వర్లు డౌన్

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలు కాసేపు నిలిచిపోయాయి. సర్వర్లు మొరాయించిన నేపథ్యంలో ఆ సంస్థ సాంకేతిక బృందం మళ్లీ సేవలను పునరుద్ధరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. టీకా పంపిణీకి మార్గదర్శకాలు

దేశంలో కొవిడ్ టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రోడ్డుపై ఫైట్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గగన్​పహడ్​ వద్ద వాహనదారుడు, హోంగార్డ్ కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న పొలీసులు ఇరువురిని పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. యూట్యూబ్‌ టాప్‌10

యూట్యూబ్‌ ఇండియా ప్రకటించిన టాప్‌ 10 వీడియోల్లో మూడు తెలుగు పాటలకు స్థానం దక్కింది. టాప్​ ట్రెండింగ్​ వీడియోల్లో 'ఢీ ఛాంపియన్​ షో'లో పండు చేసిన డాన్స్​ వీడియో ఆరో స్థానం సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. భారం కాదు

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ పితృత్వ సెలవుల కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కానున్న నేపథ్యంలో అజింక్యా రహానేపై కెప్టెన్సీ ఒత్తిడి పెద్దగా ఉండకపోవచ్చని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details