తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TODAY
టాప్​టెన్​ న్యూస్​ @11AM

By

Published : Feb 15, 2022, 10:58 AM IST

  • 30 వేల దిగువకు కేసులు

India Covid cases: భారత్​లో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసులు 30 వేల దిగువకు చేరాయి. 347 మంది చనిపోయారు. ఒక్కరోజే 82 వేల మందికిపైగా కోలుకున్నారు.

  • ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులు సహా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటనపై రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​​ విచారం వ్యక్తం చేశారు.

  • ఆఫ్‌లైన్‌లో తిరుమల టోకెన్లు జారీ

రేపటి దర్శనానికి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను తితిదే ఆఫ్​లైన్​లో జారీ చేస్తోంది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, గోవిందరాజస్వామి సత్రంలో ప్రత్యక కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేస్తున్నారు.

  • బ్యాంకులూ ఏపీకి అప్పులిస్తున్నారా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ఆర్థికశాఖ జాతీయ బ్యాంకులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)తోపాటు ఇతర కార్పొరేషన్‌లకు బ్యాంకుల నుంచి రుణాలు అందడం సంక్లిష్టమైంది.

  • అందుకే కేసీఆర్ మెచ్చుకున్నారు

‘పనిచేసేచోట నేను ‘డిక్టేటర్‌ని’... రాజీపడే ప్రసక్తేలేదు’ అంటారామె. ఆర్కిటెక్ట్‌గా.. అమెరికా, భారత్‌లలో 200కుపైగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులని పూర్తిచేసి.. తాజాగా తెలంగాణా కలెక్టరేట్‌ సముదాయాలకు ప్రాణం పోశారు ఉషారెడ్డి. మగవాళ్లే ఎక్కువగా రాణించే ఈ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఆమె 38 ఏళ్ల తన అనుభవాలని వసుంధరతో పంచుకున్నారు...

  • వయసు 60+.. 14 మందికి భర్త..

"మాట్రిమోని వెబ్​సైట్ ద్వారా పరిచయం.. నైస్​గా కబుర్లు చెప్పి పెళ్లి.. భార్య దగ్గర డబ్బులు తీసుకుని పరార్".. ఒడిశాకు చెందిన ఓ వృద్ధుడి ఘరానా మోసం సాగే తీరిది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7 రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళల్ని పెళ్లి చేసుకుని, మోసగించాడు ఆ ఘనుడు. చివరకు అరెస్టయ్యాడు.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు

Gold Price Today: దేశంలో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 52వేలకు చేరువైంది. కిలో వెండి ధర రూ. 66,460 వద్ద ఉంది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర ఇలా ఉంది..

  • కోలుకున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 300 పాయింట్లకుపైగా పెరిగి.. 56,735 వద్ద కదలాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో.. 16,930 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

  • వికెట్ కీపర్ పంత్​కు ప్రమోషన్

IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ గాయాలతో దూరమైన కారణంగా పంత్​ను ఎంపిక చేశారు.

  • బాలయ్యతో సినిమాకు ఆ డైరెక్టర్ ప్రయత్నం!

'అఖండ'తో సూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణతో డైరెక్టర్ సంపత్ నంది ఓ సినిమా తీయనున్నాడు. ఇప్పటికే కథను కూడా బాలయ్యకు వినిపించినట్లు తెలుస్తోంది. సంపత్ నంది వినిపించిన స్టోరీకి బాలయ్య ఓకే చెప్పినట్లు సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details