తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM - top ten news till now

ఇప్పటి వరకు ప్రధానవార్తలు

top news
top news

By

Published : May 4, 2021, 10:59 AM IST

1.మహమ్మారి విలయం

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,876 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 59 మంది మరణించారు. కొవిడ్​తో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,476కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. వైరస్‌ పంజా

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్​ను​ దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల‬ మంది వైరస్​ బారినపడ్డారు. వైరస్ ​బారినపడిన వారిలో మరో 3,449 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కోర్టుకెక్కారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ సతీమణి జమున, కుమారుడు నితిన్​ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జమున హేచరీస్​ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వే చేసి బోర్డులు పెట్టారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మృగరాజులను వదల్లేదు

హైదరాబాద్​ జూపార్క్​లో 8 సింహాలకు కొవిడ్​ లక్షణాలు ఉన్నాయి. సింహాల నుంచి నమునాలు సేకరించి... సీసీఎంబీకి అధికారులు పంపారు. ఇవాళ 8 సింహాల కొవిడ్​ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మరుసటి రోజే..

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. తృణమూల్​ కాంగ్రెస్​ నాయకులు.. తమ పార్ట కార్యకర్తలపై దాడి చేశారని భాజపా ఆరోపించింది. ఈ ఘటనలో భాజపాకు చెందిన ఆరుగురు కార్యకర్తలు చనిపోయారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. లాక్​డౌన్​ అవసరమే..

దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తాము నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 67శాతం మంది లాక్‌డౌన్‌కు మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకోసం క్లిక్​ చేయండి.

7. మనసున్న మంత్రి

ఒడిశా మంత్రి సుశాంత​ సింగ్.. తానే స్వయంగా అంబులెన్సు నడిపి ఓ కొవిడ్​ బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8 యూఎస్​సీఐఎస్​పై హెచ్​-1బీ దావా

ఉద్యోగాలు ప్రారంభించే తేదీని దృష్టిలో పెట్టుకుని.. సరైన రీతిలో హెచ్​-1బీ పిటిషన్లను దాఖలు చేసినప్పటికీ వాటిని రద్దు చేశారంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్​ ఏజెన్సీపై దావా వేసింది ఆ దేశానికి చెందిన ఏడు సంస్థల బృందం. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. స్వయంకృతాపరాధమే

గత ఐపీఎల్​ సీజన్లలో కనీసం ప్లే ఆఫ్​ చేరిన సన్​రైజర్స్​.. ఈసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దానికి కారణం స్వయంకృతాపరాధమే. గెలవాల్సిన నాలుగు మ్యాచ్​లు ఓడిపోవడమే కాకుండా మిడిలార్డర్​ ఘోరంగా విఫలమైంది. దీంతో ఈ సారి ప్లే ఆఫ్​ అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. డ్రీమ్​ ఎప్పటికి నెరవేరేనో..!

ప్రతి డైరెక్టర్​కు తన కలల ప్రాజెక్టు తెరకెక్కించాలని ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details