1. స్పుత్నిక్-వి వినియోగానికి గ్రీన్ సిగ్నల్
భారత్‌లో స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ.. ఈ నిర్ణయం తీసుకుంది. డీసీజీఐ తుది నిర్ణయం అనంతరం టీకా అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భాగ్య నగరంలో చిరుజల్లులు
నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిపించి జనాలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించాడు. సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, సంగీత్, ష్టేషన్, చిలకలగూడా, బోయిన్పల్లి, అల్వాల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎస్సార్‌నగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వ్యవసాయ శాఖ మంత్రికి కొవిడ్ పాజిటివ్
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో వనపర్తిలో పరీక్షలు చేయించుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ప్రత్యేక ఏర్పాట్లు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం... పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారులు దృష్టిసారించారు. ఈ నెల 11 నుంచి... అర్హులైన వ్యక్తుల బ్యాలెట్ పత్రాలు సేకరిస్తున్నారు. వికలాంగులు, కొవిడ్ బాధితులు, 80 ఏళ్లు దాటిన వారు ఈ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేలా ఈసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మూడు నెలల్లో...
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది పనులు ప్రారంభమైనట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. భారీ వరదలను తట్టుకునేందుకు వీలుగా భూమి లోపల నుంచి గోడలు నిర్మించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.