1. ఆ సభను ఆపండి
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా అనుములలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈనెల 14న జరగనున్న సభకు అనుమతి ఇవ్వొద్దని అనుములకు చెందిన రైతులు గోలి సైదిరెడ్డి, గోలి శ్రీనివాస్‌రెడ్డి పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వాటి జోలికొస్తే ఊరుకోం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకొంది. దుమ్ముగూడెం మండలం చింతగుప్పలో అటవీ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లో కందకాలు తవ్వేందుకు వెళ్లిన అధికారులను నిర్బంధించారు. సిబ్బందిని చుట్టుముట్టి చిన్న చిన్న కర్రలతో వారిపై దాడిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రతి పైసా మాదే..
ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి తెరాస నేతలు పబ్బం గడుపుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా గుర్రంపోడులో రోడ్ షోలో పాల్గొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మమత క్లీన్ బౌల్డ్
బంగాల్ ఎన్నికల సంగ్రామంలో భాజపా ఇప్పటికే సెంచరీ కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగాల్ ప్రజలు.. ఓట్ల రూపంలో తమకు ఫోర్లు, సిక్సులు ఇచ్చారన్నారు. నందిగ్రామ్‌లో మమత క్లీన్ బౌల్డ్ అయ్యారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దారి దోపిడి
ఝార్ఖండ్ రాంచీ నగరంలో ఓ వ్యాపారి నుంచి రూ.1.25కోట్లను దొంగలు దోచుకున్నారు. రోడ్డు మీదే ఈ వ్యవహారం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.