1. వైరస్ విస్తరణ
తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. ప్రస్తుతం 7,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కరోనా పంజా
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే 93,249 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ సోకినవారిలో మరో 513 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.ఈస్టర్ సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు
ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. క్షమ, త్యాగానికి ఏసుక్రీస్తు ప్రతిరూపమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. టీపాయ్ సుందరీ..!
అందమైన అమ్మాయే నట్టింట్లో ఒద్దికగా కూర్చుని టీ అందిస్తుంటే ఇంటికొచ్చిన అతిథులెవరికైనా ఆనందంగానే కాదు.. ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది కదూ. అందుకే ఈ మధ్య లివింగ్రూములో అలంకరించే సెంటర్ టేబుళ్లూ లేదా కాఫీ టేబుళ్లను అమ్మాయి బొమ్మలతో అలంకరించేస్తున్నారు సౌందర్యోపాసకులు!.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 15 మంది జవాన్లు మిస్సింగ్!
ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లా అడవుల్లో నక్సల్స్‌కు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ తర్వాత... 15 మంది భద్రతా సిబ్బంది అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.