తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@ 1PM - top ten news till 1 pm

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news till 1 pm
టాప్​ టెన్​ న్యూస్​@ 1PM

By

Published : May 31, 2020, 1:01 PM IST

'వారి కష్టం కలచివేసింది'

కరోనా వేళ.. వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వారి కష్టం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ పలు అంశాలపై చర్చించారు. అవి ఏంటంటే

అక్కడ లాక్​డౌన్ పొడిగింపు

జూన్​ 30వరకు లాక్​డౌన్​ పొడిగించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొన్నింటికి సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్​ కేసులు అధికమవుతున్న వేళ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. ఇంకేమన్నారంటే..

మొండానికి 400 మీటర్ల దూరంలో తల

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో ఓ కళాశాల విద్యార్థిని దారుణంగా హత్య చేశారు. తల, మొండెం వేరు చేసి అటవీ ప్రాంతంలో పడేశారు. అసలు ఏం జరిగింది?

నగరంలో తితిదే లడ్డూలు

హైదరాబాద్​ తితిదే కార్యాలయంలో శ్రీవారి లడ్డూల విక్రయం ప్రారంభమైంది. భక్తులు లడ్డూల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. విక్రయాలు ప్రారంభించిన 2 గంటల్లోనే ఎన్ని లడ్డూలు అమ్ముడుపోయాయంటే..

'వాళ్లని విడుదల చేయించాలి'

మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని నిర్బంధ వ్యతిరేక వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. దీనిపై ప్రోఫెసర్ హరగోపాల్ ఏమన్నారంటే..

అట్టుడుకుతున్న అమెరికా

అగ్రరాజ్యమంతా ఆందోళనలతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. పలు చోట్ల ఆందోళనలు హిసాత్మకంగా మారగా.. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఏం చేశారంటే..

ప్రధానికే జరిమానా

కరోనా వైరస్​ నిబంధనలు ఉల్లఘించినందుకు రొమేనియా ప్రధాని లుడోవిక్​ ఆర్బన్​ 600 డాలర్ల జరిమానా చెల్లించారు. ఓ బహిరంగ సమావేశంలో ధూమపానం చేయడమే కాకుండా.. దూరం పాటించకపోవడం వల్ల ఆయనకు జరిమానా విధించారు. మరింత వివరంగా...

నిరాశపడ్డాను అంటున్న స్టార్ షూటర్​

'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించిన యువ షూటర్ మను బాకర్.. ఎక్స్​క్లూజివ్​ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. బాలీవుడ్​ సినిమాలు, వంట, ఒలింపిక్స్ తదితర అంశాలపై ఏమన్నదంటే..

తారక్ ద్విపాత్రాభినయం!

టాలీవుడ్ యంగ్​టైగర్ ఎన్టీఆర్​.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ క్రేజీ న్యూస్ ఏంటంటే..

ABOUT THE AUTHOR

...view details