ముహూర్తం ఖరారు
జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బెయిలొచ్చింది
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
స్టే పొడిగింపు
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై హైకోర్టులో దాఖలైన ఏడు వ్యాజ్యాలపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం.. రెండు పిల్స్పైనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అణుబాంబు పేలుతుంది
దేశంలో పేదరికం ఉండకూడదని అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం తీసుకొచ్చామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్‌లో అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అణుబాంబు పేలుతుందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కేటీఆర్ శుభాకాంక్షలు
మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'వందే భారత్ ట్రైన్స్'ను హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ తయారు చేయటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.