1.మేడిగడ్డకు సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరుకున్న నేపథ్యంలో సీఎం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.ఆవిష్కరణ
బయో ఆసియా సదస్సు పోస్టర్, వెబ్ సైట్, థీమ్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. లైఫ్ సైన్సెస్ ఈవెంట్స్‌లో అతిపెద్ద ప్రదర్శన బయో ఆసియా సదస్సును కొవిడ్ నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు బయో ఆసియా నిర్వహణ కమిటీ ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.జైలుకు పంపుతాం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘన స్వాగతం లభించింది. డివిజన్ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్‌కి ఆహ్వానం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.జాప్యం చేసేందుకే
అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఓటుకు నోటు కేసు రాదన్న తన పిటిషన్‌పై మళ్లీ వాదనలు వినాలని కోరుతూ... రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై అనిశా కౌంటరు దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.వేడుకలు రద్దు
రిపబ్లిక్ డే (జనవరి 26) రోజున భారత్- పాక్ సరిహద్దు అయిన వాఘా వద్ద ఎలాంటి వేడుకలు ఉండవని బీఎస్ఎఫ్ వర్గాల వెల్లడించాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.