1.'ఎకో టీ కాలింగ్' పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
మాజీ సీఎస్ ఎస్కే జోషి రాసిన 'ఎకో టీ కాలింగ్' పుస్తకాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తన అనుభవాలను జోషి పుస్తక రూపంలో తీసుకురావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.'రూ.కోట్లల్లో ప్రజా ధనాన్ని సర్కారు దుర్వినియోగం చేస్తోంది'
ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఆలోచించకుండా రూ. కోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తోందని తెజస ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరావు ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.'కేంద్రం నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారో తెలపాలి'
రాష్ట్రానికి కరోనా సాయం కింద కేంద్రం రూ.7650 కోట్ల నిధులు విడుదల చేస్తే వాటిని దాచిపెడుతున్నారని ఎంపీ సోయం బాపూరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకం కూడా కేంద్రానిదే అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.'జాతి సంపద పెంచుతున్నాం.. కేంద్రం చేయూతనివ్వాలి'
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కేంద్రం దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం వరి ధాన్యంలో 56 శాతం పైగా తెలంగాణ నుంచే సేకరించిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.దుబే వ్యవహారంపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్
ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలను బలిగొని ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దుబేకు సంబంధించిన ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.