1. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ
ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ చేరువ చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్లో రూ. 34 కోట్ల వ్యయంతో ఐటీ హబ్‌ను ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. బ్యాంకు ఉద్యోగులను కాపాడండి
కరోనా మహమ్మారి బ్యాంకర్లను వదలట్లేదని.. వారిని రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏఐబీఓసీ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. వైద్యుల ఆందోళన
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాలను కట్టాలని వైద్యులు ఆందోళనకు దిగారు. 2015లో ఆస్పత్రిని సీఎం కేసీఆర్ పరిశీలించి నూతన భవన నిర్మాణానికి ఆదేశాలిచ్చారని డాక్టర్లు గుర్తు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. వీడని ఉత్కంఠ!
రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్‌కు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. ఒకేసారి నాలుగు బైక్‌లు ఢీ
నాలుగు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటన కర్ణాటక కొప్పల్ ప్రాంతంలో జరిగింది. ముందు బైక్ మీద వెళ్తున్న వ్యక్తి తన బండిని ఎడమ వైపునకు తిప్పాడు. వెనుక మరో ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తి.. వాళ్లకు తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.