1. ఆధారాలు చూపండి
లాభాపేక్షతో కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులేవో పేర్కొని.. వాటిని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. ఆశలు రేపుతున్న వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది..? ఇంకెన్నాళ్లు నిరీక్షించాలి..? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ. కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో విరుగుడు కనిపెట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థ ముందడుగు వేసింది. "కొవాగ్జిన్" పేరిట వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డీసీజీఐ అనుమతి కూడా పొందింది. వచ్చే నెలలో మనుషులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది భారత్ బయోటెక్. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. గోబెల్స్ ప్రచారం
కొండపోచమ్మ సాగర్ కాలువ లీకేజీపై.. కాంగ్రెస్, భాజపాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆర్థికమంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాలువకు చిన్నగండి పడితే పెద్ద రాద్దాంతం చేస్తున్నాయన్న హరీశ్... కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం.. ఆశ్చర్యంగా ఉందన్నారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. పోరాడుతున్నారు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు పోరాడుతున్నారంటూ గవర్నర్ తమిళి సై అభినందించారు. రాజ్ భవన్ నుంచి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యులకు తామున్నామని ధైర్యం చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. పార్లమెంట్ సమావేశాలు!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలివారంలో నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.