1. పదవికే ప్రమాదం
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం ఫలితాలను చూపించనట్లైతే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవి పోతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. ఒప్పంద ప్రాతిపదికన ఉన్న గ్రామ కార్యదర్శుల పదవి పర్మినెంట్ కాదన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. మరో కొత్త మండలం
మెదక్ జిల్లాలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్త మండలంగా మాసాయిపేటను ఏర్పాటు చేస్తే నోటిఫికేషన్ జారీ చేసింది. చేగుంట మండలంలో మూడు, ఎల్దుర్తి మండలంలో ఆరు గ్రామాలతో మాసాయిపేట మండలం ఏర్పాటు కానుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. శుక్రవారంలోగా చెప్పండి
విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించటం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆన్లైన్ తరగతులపై స్పష్టమైన, సమగ్రమైన పాలసీని ప్రభుత్వం ఎందుకు రూపొందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్లైన్ తరగతుల కోసం అందరికీ లాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు కొనే ఆర్థిక స్థోమత ఉంటుందా అని ధర్మాసనం నిలదీసింది. దీనిపై ఈ నెల 3 లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. మోస్తరు వర్షాలు
ఒడిశా తీరంతోపాటు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు.. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. లాక్డౌన్ ఊహాగానాలు
హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను మరోసారి అమలుచేస్తారనే ప్రచారం నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. రైల్వే, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.