పోరుకు కాంగ్రెస్ సై..
భారత్‌లో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలపై ఈనెల 29న దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గల్వాన్ లోయలో అమరులైన జవాన్లకు శుక్రవారం నివాళులు అర్పించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. పీసీసీలకు సూచించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కాంగ్రెస్‌పై ఫైర్!
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్... స్వేచ్ఛ గురించి మాట్లాడుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. జూమ్ యాప్ ద్వారా భాజపా నాయకులు, ముఖ్యకార్యకర్తలతో ఆయన మాట్లాడారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
హరితహారంలో పోలీసులు!
మేడ్చల్ జిల్లా పర్వతాపూర్‌లో నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణ స్థలంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి పోలీసులు మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఫలితాలేవి?
కరోనా పరీక్షలు చేయించుకున్న 48 గంటల్లో నివేదిక ఇస్తామన్న ప్రభుత్వం.. తన ఐదుగురు అంగరక్షకులు పరీక్షలు చేయించుకుని ఐదు రోజులైనా రిపోర్ట్ ఇవ్వలేదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్నారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
24 గంటల్లో 22 మంది
బిహార్‌లో 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు గురై 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.