1.వారాంతపు లాక్‌డౌనా..?
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. వారాంతపు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరుగుతున్న మరణాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సరైనప్పుడే...
భవిష్యత్ కార్యచరణపై సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులతో చర్చించానన్న ఈటల... ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కసరత్తు
రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలకు మేయర్, ఛైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తి చేయడంపై తెరాస దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలకులను నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అమల్లోకి ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం 12 తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అధికారులు దుకాణాలకు అనుమతి ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ఆసుపత్రుల్లో ఆప్రమాదాలు ఆపండి'
ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల్లో అగ్ని ప్రమాదాల నివారణపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది కేంద్ర హోంశాఖ. వేసవిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువున్న కారణంగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.