తెలంగాణ

telangana

ETV Bharat / state

Top Ten News: టాప్​టెన్​ న్యూస్ @11AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News
టాప్​ న్యూస్ @ 11AM

By

Published : Feb 2, 2022, 10:51 AM IST

  • బడ్జెట్​ తర్వాత తొలి సమావేశం

పార్లమెంటులో బడ్జెట్​ ప్రవేశపెట్టిన తర్వాత తొలిరోజు ఉభయ సభలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు లోక్​సభ సమావేశాలు జరుగుతున్నాయి.

  • తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు

భారత్​లో కరోనా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు మరో 1,61,386 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,733 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • 4 వారాల్లో ఒమిక్రాన్‌ ఉద్ధృతి తగ్గుముఖం

తొలి రెండు కొవిడ్‌ దశల్లో బీటా, డెల్టా వేరియంట్ల కారణంగా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మూడోదశలో ఒమిక్రాన్‌ వల్ల మరణాలు చాలా తక్కువ నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉందని... రాష్ట్రంలో ‘బిఎ 2’ ఉపరకం ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు.

  • తెలంగాణకు దక్కిన కేటాయింపులు ఇలా

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులేమీ కనిపించకపోయినా... వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, సింగరేణి బొగ్గు గనులకు కాస్త నిధులు కేటాయించారు. మరోవైపు రక్షణ రంగం బలోపేతంతో హైదరాబాద్‌కు లబ్ధి చేకూరనుంది.

  • వెలవెలబోయిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు మంగళవారం వెలవెలబోయాయి. కార్యాలయాలన్నీ సందడి లేకుండా కనిపించాయి. భూములు, ఇంటి స్థలాలు, అపార్టుమెంట్లలోని ఫ్లాట్‌ల విలువలు మంగళవారం అమలులోకి రావడంతో ఎవ్వరూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపలేదు.

  • పాజిటివ్‌ వచ్చినా ఐసోలేషన్‌ అక్కర్లేదు

కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆంక్షలను సడలించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ముఖ్యంగా కొవిడ్​ పాజిటివ్​ పాజిటివ్​ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్​ అవసరమే లేదని ప్రకటించింది. పాఠశాలల్లో భౌతిక దూరం నిబంధననూ ఎత్తివేసింది.

  • స్టాక్ మార్కెట్లకు బడ్జెట్​ బూస్ట్​

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ సానుకూలతలతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, పవర్ గ్రిడ్​ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టెక్​ మహీంద్రా, సన్​ఫార్మా, టాటా స్టీల్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

  • 4 స్తంభాలపై రూ.40లక్షల కోట్లు

బడ్జెట్​లో నాలుగు ప్రధాన అంశాలపైనే దృష్టి సారించింది కేంద్రం. వీటితో పాటు ఈ-విద్య, 5జీ, డిజిటల్​ కరెన్సీపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

  • ఐపీఎల్​ వల్లే.. టీమ్​లోకి రాగలిగా

ఐపీఎల్​ వల్లే తాను జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలిగానని అన్నాడు యువ బౌలర్​ అవేశ్​ ఖాన్​. బౌలర్​గా ఎదగడంలో దిల్లీ హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్​ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిదని చెప్పాడు.

  • 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్

ప్రభాస్, పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details