తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @5PM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
టాప్​న్యూస్ @5PM

By

Published : Aug 8, 2022, 4:59 PM IST

  • 'సభలో సింహం'.. వెంకయ్యపై ప్రశంసల జల్లు..

Venkaiah Naidu farewell: ఐదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకోనున్న ఉపరాష్ట్రపతి​ వెంకయ్య నాయుడుపై రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేలా సభ్యుల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు. వెంకయ్య తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రస్తావిస్తూ ఆత్మకథ రాయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

  • భారత్​ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్​లో అదరగొట్టిన లక్ష్యసేన్‌

కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా చివరి రోజు ఆటలో భారత్​ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌... జె యంగ్‌ను ఓడించి గోల్డ్ మెడల్ సాధించాడు.

  • ప్రియుడి గొంతు కోసిన మహిళ..

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్​కేస్​లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్​ ప్రాంతానికి చెందిన ఫిరోజ్​గా గుర్తించారు.

  • ప్రమాదమని తెలిసినా.. పొట్టకూటి కోసం

వాగు దాటేందుకు అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామ ప్రజలు పంట పొలాల్లో పనిచేయడానికి వాగు దాటేందుకు మహిళా కూలీలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాగుపై వంతెన లేకపోవడంతో చింతచెట్ల కొమ్మలు పట్టుకుంటూ నదిని దాటి ప్రమాదకరంగా దాటుతున్నారు.

  • ప్రమాదం అంచున ప్రాజెక్ట్​.. భయాందోళనలో ప్రజలు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుమురం భీం ప్రాజెక్ట్​ ప్రమాదం అంచున నిలిచింది. ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు రావడంతో ప్లాస్టిక్​ కవర్లు కప్పడం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉండటంతో దిగువ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

  • 'త్వరలో తెరాస పార్టీలో బాంబ్​ బ్లాస్ట్'

muralidhara rao fires on cm kcr : ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్​లపై భాజపా సీనియర్‌ నేత, ఆ పార్టీ మధ్యప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌రావు విరుచుకుపడ్డారు. వాళ్లకు ఆర్థిక శాస్త్రం రాదని ఆరోపించారు. త్వరలో తెరాసలో భుకంపం రాబోతుందని వెల్లడించారు.

  • నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

RAIN ALERT: బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. పలుచోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని ఆమె వెల్లడించారు.

  • అదరగొట్టిన పీవీ సింధు.. తొలిసారి స్వర్ణం కైవసం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.

  • భర్త చనిపోయాక నటి మీనా తొలి పోస్ట్​..

Actress Meena: ఇటీవలే భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న సీనియర్​ నటి మీనా ఇంటికి అప్పటి హీరోయిన్లు రంభ, సంఘవి, సంగీత వెళ్లి పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోను మీనా సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది. ఈ ఫొటో చూస్తుంటే మీనా ఇప్పుడిప్పుడే బాధను దిగమింగుకుని నార్మల్ లైఫ్​లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

  • రాజమౌళి చెప్పడం వల్లే ఎన్టీఆర్​తో అలా చేశా

విలక్షణ పాత్రలతోనే కాదు.. నటనతో ఎంతో ఆకట్టుకునే నటుడు రాజీవ్‌ కనకాల. విద్యార్థిగా, యువ నాయకునిగా ఎన్నో పాత్రలను పోషించారు. చూడగానే సొంతింటి మనిషి అన్నట్టుగా ఉండే రాజీవ్‌ దాదాపుగా 150 చిత్రాల్లో నటించారు. ఇప్పటికే మూడు దశాబ్దాల నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాజీవ్‌ కనకాల ఈటీవీ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. తన నటన, పాత్రల తీరు, పరిశ్రమతో అనుబంధాన్ని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details