తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్​ @3PM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
టాప్​న్యూస్​ @ 1PM

By

Published : Aug 8, 2022, 2:59 PM IST

  • ఐకమత్యంతో జాతి ఔన్నత్యం చాటాలి

జాతిపిత గాంధీజీనీ కొందరు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని.. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడుగానే ఉంటాడని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని తెలిపారు. అనేక త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న ముఖ్యమంత్రి.. ఏ దేశానికికైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూప సందర్భమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు అద్భుతంగా జరగాలని ఆకాంక్షించారు.

  • భాజపాకు నితీశ్ గుడ్​బై?.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు!

JDU BJP alliance news: బిహార్ రాజకీయాలు కీలక మలుపు తీసుకునేలా కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా భాజపా, జేడీయూ మధ్య దూరం పెరుగుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. తాజాగా ఏమైందంటే?

  • రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన స్పీకర్​

MLA Rajagopal reddy resignation : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు తన రాజీనామాను తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి సమర్పించారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి సమర్పించిన లేఖను స్పీకర్ ఆమోదించారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి స్వయంగా వెల్లడించారు. అసెంబ్లీకి వెళ్లేముందు రాజగోపాల్ రెడ్డి గన్​పార్కు వద్ద అమరవీరు స్థూపానికి నివాళులర్పించారు.

  • వానొచ్చిందంటే 'తాడు'తోనే వారి ప్రయాణం

Live Video : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాంకిడి మండలం పిప్పర్​గొండి గ్రామానికి వర్షాకాలం వచ్చిందంటే మధ్యలో ఉన్న వాగు ఉప్పొంగడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వంతెన లేక, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వాగుకు రెండు వైపులా తాడు కట్టి దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు

ఉపరాష్ట్రపతి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న వెంకయ్య నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే, దేశ ప్రజలకు వెంకయ్య నాయుడి అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

  • ఆస్పత్రిలో అర్ధరాత్రి బర్త్​డే పార్టీ..

ఆస్పత్రిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి యువకులు హల్​చల్ చేశారు. పుట్టినరోజు జరుపుకొంటున్న యువకుడిని స్నేహితులు బెల్టులతో కొట్టారు. ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆస్పత్రిలో ఆదివారం అర్ధ రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఫార్మసీలో పనిచేసే అతడి స్నేహితులు బెల్టులతో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఎమర్జెన్సీ విభాగాలు పక్కనే ఉన్నా.. వీరంతా ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన ఆస్పత్రి వైద్యుడు ఆనంద్ ఓఝాన్.. ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • 'అవి' చూపించాడని రహస్య భాగాలపై పెట్రోల్ పోసి..

మహిళల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

  • మనిషిని మోసుకెళ్లే 'వరుణ' డ్రోన్ రెడీ..

Varuna Drone India : మనిషిని మోసుకెళ్లగల సామర్థ్యంతో అధునాతన 'వరుణ' డ్రోన్​ను రూపొందించినట్లు ప్రకటించింది పుణెకు చెందిన ఓ సంస్థ. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఈ డ్రోన్​ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.

  • ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ ఘనత

నందమూరి హీరోలు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తెలుగు ఇండస్ట్రీలో ఓ ఘనత సాధించారు. సినిమా సినిమాకు వీరు చేస్తున్న ప్రయోగాల వల్ల టాలీవుడ్​కు స్టార్ డైరెక్టర్లు దొరుకుతున్నారు. వీరి సినిమాలతో వచ్చిన దర్శకులు ప్రస్తుతం బడా హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్​లో కొనసాగుతున్నారు. ఆ సంగతులేంటో తెలుసుకుందాం...

  • 'బింబిసార' చిన్నారి గురించి ఈ విషయాలు తెలుసా?

Bimbisara Baby: 'అఖండ', 'ఆర్ఆర్ఆర్' సినిమాల తరహాలోనే బింబిసారలోనూ చిన్నారి క్యారెక్టర్​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ చిన్నారి విశేషాలను తెలుసుకుందాం...


ABOUT THE AUTHOR

...view details