తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today : టాప్‌న్యూస్‌ @11AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
టాప్‌న్యూస్‌ @11AM

By

Published : Jul 22, 2022, 10:59 AM IST

  • 12వ తరగతి ఫలితాలు విడుదల

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఈ ఉదయం సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in లేదా cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది.

  • స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు..

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య 21,880 మంది వైరస్​ బారినపడగా.. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 21,219 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.46 శాతానికి చేరింది.

  • నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య

Lovers Suicide : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన జంటను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.

  • చేతులెత్తి మొక్కుతున్నాం.. ఆదుకోండి

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద బీభత్సానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. ప్రజలు కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి నెలకొంది. కూలిన ఇళ్ల గోడలు, చుట్టూ, లోపల బురద, పాడైన సామగ్రి.. దోమలు, పాములు.. ములుగు జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. చాలా ఇళ్లు వరదలకు దెబ్బతిన్నాయి. చేతులేత్తి మొక్కుతున్నాం ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • 'పుష్ప' సీన్ రిపీట్..

అటవీ సంపదను అధికారులు కన్నులు గప్పి సొమ్ము చేసుకుంటారు. కూలీల సాయంతో చాకచక్యంగా దాచిపెట్టి.. మార్కెట్ ఉన్నప్పుడు తరలించి లక్షల రూపాయల వ్యాపారం చేసే స్మగ్లింగ్... ఈ కథ ఎక్కడో విన్నట్లుంది కదు..!అదే పుష్ప సినిమా... ప్రస్తుతం కొందరు అక్రమార్కులు ఆ సినిమానే ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ స్మగ్లర్లు సరుకును ఏ నీటిలోనో, బావిలోనో దాయలేదు. ఏకంగా భూమిలోనే దాచి అధికారుల కళ్లుగప్పి అక్రమ దందా సాగిస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..?

  • ఫోర్బ్స్‌లో తెలంగాణ కుర్రాడికి చోటు

ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్టార్స్‌లో తెలంగాణ యువకుడు చోటు సంపాదించాడు. తెలుగు టక్‌టట్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న సయ్యద్ హఫీజ్‌కు ఫోర్బ్స్‌లో 32వ స్థానం లభించింది. ఇతడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందినవాడు.

  • షియర్ జోన్ ఎఫెక్ట్.. ఇవాళ, రేపు వర్షాలు

గత మూడ్రోజుల నుంచి శాంతించిన వరణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వాన పడే సూచన ఉన్నట్లు తెలిపింది.

  • రెడ్​మీ కే సిరీస్​లో సరికొత్త ఫోన్​..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి.. మరో కొత్త ఫోన్​ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్​మీ కే50ఐ 5జీ స్మార్ట్​ఫోన్​ భారత్​లో లాంఛ్​ అయింది. జులై 23న సేల్​కు రానుంది. 12 రకాల 5జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్‌ కూడా ఇదే. దీంతో.. ఎలాంటి అంతరాయం లేకుండా గేమ్‌లను ఆడుకోవడంతోపాటు, 8కే క్వాలిటీ వీడియోలను కూడా బఫరింగ్ లేకుండా చూడగలరు. దీంట్లో మరిన్ని అద్భుత ఫీచర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • కోహ్లీ, రోహిత్‌, ధోనీ రికార్డ్స్​పై కన్నేసిన ధావన్​!

వెస్టిండీస్‌తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ముందు అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, అతడు ఇప్పుడు జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వన్డే క్రికెట్‌ మాత్రమే ఆడుతున్న ధావన్‌.. కెరీర్‌లో రెండోసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతలను చేపట్టాడు.

  • ఓటీటీలో సినిమా.. లాభమా? నష్టమా?

OTT Release: ఇకపై థియేటర్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా విడుదల చేయాలని ఇటీవలే టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని ప్రస్తుతం నిర్మాతలు పట్టుబడుతున్నారు. మరి దీనివల్ల లాభమా? నష్టమా? తెలుసుకుందాం..

ABOUT THE AUTHOR

...view details